Sat Dec 21 2024 05:18:52 GMT+0000 (Coordinated Universal Time)
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఆసియా కప్ సూపర్-4 షెడ్యూల్
లాహోర్లోని గడాఫీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాస్ గెలిచి
ఆసియా కప్ సూపర్-4 తొలి మ్యాచ్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు పోరాడనున్నాయి. లాహోర్లోని గడాఫీ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): మహ్మద్ నైమ్, మెహిది హసన్ మిరాజ్, లిట్టన్ దాస్, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(w), షమీమ్ హొస్సేన్, అఫీఫ్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్
గ్రూప్ ఎ నుంచి ఇండియా, పాకిస్థాన్.. గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ టీమ్స్ సూపర్ 4కు అర్హత సాధించాయి. భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్ 4 లో భాగంగా ఈసారి కొలంబోలో తలపడనున్నాయి. లీగ్ స్టేజ్ లో పల్లెకెలెలో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయిన విషయం తెలిసిందే.
ఆసియా కప్ సూపర్ 4 షెడ్యూల్
సెప్టెంబర్ 6: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్, లాహోర్
సెప్టెంబర్ 9: శ్రీలంక vs బంగ్లాదేశ్, కొలంబో
సెప్టెంబర్ 10: ఇండియా vs పాకిస్థాన్, కొలంబో
సెప్టెంబర్ 12: ఇండియా vs శ్రీలంక, కొలంబో
సెప్టెంబర్ 14: పాకిస్థాన్ vs శ్రీలంక, కొలంబో
సెప్టెంబర్ 15: ఇండియా vs బంగ్లాదేశ్, కొలంబో
సెప్టెంబర్ 17: ఫైనల్, కొలంబో
Next Story