Mon Dec 23 2024 16:09:48 GMT+0000 (Coordinated Universal Time)
సినిమా స్క్రిప్ట్ ను మించి.. అద్భుతమైన కంబ్యాక్ తో భారత్ విక్టరీ
శనివారం చెన్నై లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఏషియన్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో
శనివారం చెన్నై లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఏషియన్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో భారత్ 4-3తో మలేషియాపై విజయాన్ని అందుకుంది. ఒకానొక దశలో భారత్ విజయాన్ని అందుకోవడం కూడా కష్టమేనని భావించారు. 3-1 తో మలేషియా మ్యాచ్ లో ముందంజలో ఉన్న సమయంలో భారత్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. జుగ్రాజ్ సింగ్ (9వ నిమిషం), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (45వ), గుర్జంత్ సింగ్ (45వ), ఆకాశ్‌దీప్ సింగ్ (56వ) భారత్‌కు గోల్స్ అందించారు. మలేషియా తరఫున అబు కమల్ అజ్రాయ్ (14వ ని.), రజీ రహీమ్ (18వ ని.), ముహమ్మద్ అమీనుదిన్ (28వ) గోల్స్ కొట్టారు.
శనివారం జరిగిన ఫైనల్లో భారత హాకీ జట్టు 4-3 గోల్స్ తేడాతో మలేసియాపై అద్భుత విజయాన్ని అందుకుంది. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ నెగ్గడం భారత్ కు ఇది నాలుగోసారి కావడం విశేషం. ఆట తొలి క్వార్టర్ లో భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట 9వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచిన భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తొలి క్వార్టర్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా అబు కమల్ ఫీల్డ్ గోల్ తో స్కోరును సమం చేశాడు. ఇక రెండో క్వార్టర్ లో మలేసియా దూకుడు ప్రదర్శించింది. 10 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ వేసింది. దాంతో స్కోరు బోర్డులో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మూడో క్వార్టర్ లో భాగంలో గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి.45వ నిమిషం వరకు కూడా మలేసియానే ఆధిక్యంలో నిలిచింది. భారత్ 1-3 గోల్స్ తేడాతో వెనుకబడింది. ఆట 45వ నిమిషం వద్ద భారత్ రెండు గోల్స్ చేసి స్కోరు బోర్డును సమం చేసింది. ఇక చివరి క్వార్టర్ లో భారత్ ఆట మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా అద్భుత ఫీల్డ్ గోల్ తో నాలుగో గోల్ సాధించింది. ఆ తర్వాత మలేషియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టైటిల్ ను నెగ్గింది.
Next Story