Mon Dec 23 2024 07:45:58 GMT+0000 (Coordinated Universal Time)
బంగారు పతకం సాధించిన విమెన్స్ క్రికెట్ టీమ్
ఆసియా గేమ్స్ లో భారత మహిళల జట్టు బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది.
ఆసియా గేమ్స్ లో భారత మహిళల జట్టు బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. లో స్కోరింగ్ మ్యాచ్ లో భారత జట్టు శ్రీలంక ను ఓడించి బంగారు పతాకాన్ని సొంతం చేసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 2023 ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం.
ఫైనల్లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో కేవలం 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకానొక దశలో భారత్ 140 పరుగులు చేసేలా కనిపించినా.. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారతజట్టు స్టార్ బ్యాటర్లు అనుకున్న విధంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. మందాన 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. జెమీమా 42 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో భారత్ ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తక్కువ టార్గెట్ కావడంతో భారత బౌలర్లు పోరాడాల్సి వచ్చింది. సాధు అద్భుతమైన బౌలింగ్ తో మూడు వికెట్లు తీసింది. నాలుగు ఓవర్ల పాటూ బౌలింగ్ వేసిన సాధు కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది. హాసిని పెరీరా చేసిన 25 పరుగులే శ్రీలంక జట్టు తరపున టాప్ స్కోరు. ఇక ఆఖర్లో రన్ రేట్ పెరిగిపోవడం.. బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టడంతో భారత మహిళలు గోల్డ్ ను సాధించారు.
Next Story