ఆసియా గేమ్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇండియా
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది.
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారి 100 పతకాలను గెలిచింది. మహిళల కబడ్డీలో భారత జట్టు స్వర్ణం గెలుచుకోవడం ద్వారా ఈ మార్కు అందుకుంది. ఈ సారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు గెలడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. దీంతో అనుకున్న లక్ష్యాన్ని ఇండియా పూర్తి చేసింది. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు గెలిచిన పతకాల సంఖ్య 100కు చేరింది. ఇందులో 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్య పతకాలున్నాయి. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కాగా గతంలో ఇండినేషియా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ అత్యధికంగా 70 పతకాలను గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా 100 పతకాలు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంకా పలు పోటీలలో భారత్ ఉండడంతో పతకాల సంఖ్య మరింత పెరగడం ఖాయం అని అంటున్నారు.