Sat Dec 21 2024 06:32:45 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ లో ఫిక్సింగ్ కలకలం
విశాఖలో జరిగిన ఆస్ట్రేలియా - భారత్ వన్డే మ్యాచ్లో ఫిక్సింగ్ కలకలం రేగింది
విశాఖలో జరిగిన ఆస్ట్రేలియా - భారత్ వన్డే మ్యాచ్లో ఫిక్సింగ్ కలకలం రేగింది. టీం ఇండియా బౌలర్ సిరాజ్ ను ఒక పంటర్ సంప్రదించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక యువకుడు తాను బెట్టింగ్లో చాలా పోగొట్టుకున్నానని, తనకు సాయం చేయాలంటూ బౌలర్ సిరాజ్ కు వాట్సప్ మెసేజ్ చేశాడు.
బెట్టింగ్ పాల్పడాలని...
అంటే బెట్టింగ్ కు పాల్పడాలని పరోక్షంగా ప్రోత్సహించాడనే అర్థం చేసుకోవాలి. తనకు బెట్టింగ్లలో డబ్బులు పోయామని తనకు సాయం చేయాలని కోరడంతో అనుమానం వచ్చిన సిరాజ్ బీసీసీఐ అవినీతి విభాగానికి ఫిర్యాదు చేశాడు. దీంతో బీసీసీఐ స్థానిక పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకు రావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పంటర్ను అదుపులోకి తీసుకున్నారు. పంటర్ హైదరాబాద్ కు చెందిన డ్రైవర్గా గుర్తించారు. ఈ మార్చినెలలో విశాఖలో ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. అయితే ఈ పంటర్కు ఏ బెట్టింగ్ ముఠాతోనూ సంబంధం లేదని గుర్తించారు.
Next Story