Sun Dec 22 2024 19:53:44 GMT+0000 (Coordinated Universal Time)
భారీ టార్గెట్.. ఇండియా గెలుస్తుందా?
రాజ్కోట్లో జరుగుతున్న మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. టీం ఇండియా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది
రాజ్కోట్లో జరుగుతున్న మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. టీం ఇండియా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. యాభై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేయడంతో ఇప్పుడు టీం ఇండియా టార్గెట్ 353 పరుగులు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మిచెల్ మార్ష్ తృటిలో సెంచరీని కోల్పోయాడు. 84 బంతులు ఎదుర్కొని మార్ష్ 96 పరుగులు చేశాడు.
353 పరుగుల లక్ష్యం...
డేవిడ్ వార్నర్ యాభై ఆరు పరుగులు చేశాడు. స్టీవ్ స్మిత్ 74, లబుషేన్ 72 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు భారీ స్కోరును తెచ్చి పెట్టారు. ఇంతటి లక్ష్యాన్ని సాధించాలంటే టీం ఇండియా ఆటగాళ్లు నిలకడగా ఆడి తీరాల్సి ఉంటుంది. వికెట్లు కోల్పోకుండా పరుగులు వేగంగా చేస్తేనే అనుకున్న లక్ష్యానికి చేరువవుతుంది. భారత్ బౌలర్లలో బుమ్రా మూడు, కులదీప్ రెండు, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ తీశారు. మరి మూడో మ్యాచ్లో గెలుపెవరిదన్నది చూడాల్సి ఉంది.
Next Story