Fri Jan 10 2025 11:19:47 GMT+0000 (Coordinated Universal Time)
ఐర్లాండ్ పై విజయాన్ని దక్కించుకుని.. సెమీస్ రేస్ లో నిలిచిన ఆసీస్
ఆస్ట్రేలియా, ఐర్లాండ్ మధ్య ఈరోజు జరిగిన సూపర్-12 గ్రూప్-1 మ్యాచ్ లో ఆసీస్ విజయాన్ని అందుకుంది. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానం వేదికగా సాగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. ఐర్లాండ్ ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా.. ఐర్లాండ్ జట్టు టాపార్డర్ తక్కువ పరుగులకే కుప్పకూలిపోయింది. పాల్ స్టిర్లింగ్ (11), ఆండ్రూ బాల్బిర్నీ (7) పరుగులకే అవుట్ అయ్యారు. లోర్కాన్ టక్కర్ (71) ఒంటరి పోరాటం చేశాడు. చివరికి 137 పరుగుల వద్ద ఐర్లాండ్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా 2 వికెట్లు తీశారు.
కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూకుడుగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేయగా, ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ కేవలం 3 పరుగులకే అవుట్ కాగా, మిచెల్ మార్ష్ తో కలిసి ఫించ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఫించ్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 63 పరుగులు చేశాడు. మార్ష్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సులతో 28 పరుగులు సాధించాడు. మ్యాక్స్ వెల్ (13) ఫెయిల్ అయినా.. మార్కస్ స్టొయినిస్ మరోసారి తనదైనశైలిలో ఆడి 25 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 15, మాథ్యూ వేడ్ 7 పరుగులతోనూ నాటౌట్ గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్ కార్తీ 3, జోష్ లిటిల్ 2 వికెట్లు తీశారు.
Next Story