Wed Dec 25 2024 01:39:32 GMT+0000 (Coordinated Universal Time)
హై స్కోరింగ్ థ్రిల్లర్ లో విన్నర్ గా నిలిచిన ఆస్ట్రేలియా
ధర్మశాల వేదికగా సాగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఓ మంచి థ్రిల్లర్
ధర్మశాల వేదికగా సాగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఓ మంచి థ్రిల్లర్ మూవీలా సాగింది. ఆస్ట్రేలియా భారీ స్కోరును ఇవ్వగా.. న్యూజిలాండ్ దాదాపుగా చేధించేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా డాట్ బాల్ పడడంతో ఆసీస్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ రేసులో నిలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసింది. అతి భారీ లక్ష్యం అయినప్పటికీ న్యూజిలాండ్ పోరాడింది 9 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది.
టాస్ గెలిచి కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (109), వార్నర్ (82) దుమ్ము దులిపారు. తొలి వికెట్ కు 19 ఓవర్లలోనే 175 పరుగులు జోడించారు. మిడిల్ ఆర్డర్ విఫలమైనా చివర్లో మ్యాక్స్ వెల్(41), కమ్మిన్స్(37), ఇంగ్లిస్(38) మెరుపులు మెరిపించడంతో కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర తన అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ సెంచరీ(116) చేశాడు. డారిల్ మిట్చెల్(54) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో జిమ్మీ నీషం(57) అద్భుతంగా ఆడాడు. ఆఖరి ఓవర్లో నీషం రనౌట్ అవ్వడంతో మ్యాచ్ ఆసీస్ చేతిలోకి వచ్చింది. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు తీసుకోగా.. స్టార్క్, హాజెల్ వుడ్ లకు రెండేసి వికెట్లు లభించాయి.
Next Story