Wed Dec 25 2024 02:13:59 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్-12 సమరం కాసేపట్లో మొదలు.. ఆస్ట్రేలియాతో తలపడనున్న న్యూజిలాండ్
టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ల లీగ్ దశలు ముగిశాయి. ఇక అసలు సమరం సూపర్-12 లో మొదలు కాబోతోంది. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదటి సూపర్-12 మ్యాచ్ లో నేడు తలపడనున్నాయి. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ల మధ్య దుబాయ్‌లో జరిగే 2021 ఫైనల్ కు.. ఇక్కడ రీ-మ్యాచ్ మొదలుకాబోతోంది. ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు గ్రౌండ్ నిర్వాహకులు. ఇక మ్యాచ్ సవ్యంగా సాగుతుందా లేదా అనే విషయమై.. మైదానంలోని పరిస్థితులు కాకుండా వర్షం విషయంలో భయపడుతున్నారు. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. భారతదేశంలో ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. డిస్నీ+హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ జట్ల వివరాలు:
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే(w), ఫిన్ అలెన్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మైకేల్ బ్రేస్‌వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి , డారిల్ మిచెల్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, స్టీవెన్ స్మిత్, కేన్ రిచర్డ్సన్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్.
Next Story