Sat Dec 21 2024 05:22:16 GMT+0000 (Coordinated Universal Time)
భయపెట్టిన పాకిస్థాన్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు పరాజయం మూటగట్టుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ 62 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు చేయగా... పాకిస్థాన్ 45.3 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఓ దశలో పాక్ విజయం దిశగా వెళుతున్నట్లు కనిపించగా.. కీలక దశ ఆ జట్టు ఆటగాళ్లు చేజేతులా వికెట్లు కోల్పోయారు. దీంతో వరుసగా రెండో ఓటమిని పాకిస్థాన్ మూటగట్టుకుంది.
ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (70), అబ్దుల్లా షఫీక్ (64) తొలి వికెట్ కు 21.1 ఓవర్లలో 134 పరుగులు జోడించి శుభారంభం అందించారు. భారత్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన కెప్టెన్ బాబర్ అజామ్ ఈ మ్యాచ్ లో 18 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహ్మద్ రిజ్వాన్ 46, షకీల్ 30, ఇఫ్తికార్ 20 బంతుల్లో 3 సిక్సులతో 26 పరుగులు చేసి మ్యాచ్ ను పాక్ వైపు తిప్పినా.. ఆఖర్లో కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను ఆసీస్ కు ఇచ్చేసింది. ఆసీస్ బౌలర్లలో జంపా 4, కమిన్స్ 2, స్టొయినిస్ 2, స్టార్క్ 1, హేజెల్ వుడ్ 1 వికెట్ తీశారు. ఆసీస్ వరుసగా రెండు విజయాలను సాధించి నాలుగో స్థానానికి ఎగబాకింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలు బాదడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. మార్ష్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు సాధించాడు. వార్నర్, మార్ష్ అవుటయ్యాక... మ్యాక్స్ వెల్ (0) డకౌట్ కాగా, స్టీవ్ స్మిత్ (7) నిరాశపరిచాడు. స్టొయినిస్ 21, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 13, లబుషేన్ 8, కెప్టెన్ కమిన్స్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 5, హరీస్ రవూఫ్ 3, ఉసామా మిర్ 1 వికెట్ తీశారు.
Next Story