ఆస్ట్రేలియా మీద అద్భుతమైన విజయాన్ని అందుకున్న విండీస్
పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టును
పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టును విండీస్ ఓడించింది. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ క్రెయిగ్ బ్రాత్ వైట్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు 8 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై 21 ఏళ్ల తర్వాత విండీస్ సాధించిన తొలి విజయం ఇది. విండీస్ బౌలర్ షామార్ జోసెఫ్ రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. షామార్ కు కెరీర్ లో రెండో టెస్టు ఇది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో విండీస్ కు సంచలన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనూ షామార్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో విండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను గెలిపించేందుకు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్) ఆఖరి వరకు ప్రయత్నించాడు. అయితే షమార్ జోసఫ్ (7/68) విజృంభించడంతో ఆసీస్‌కు పరాభవం తప్పలేదు. 1997 తర్వాత ఆసీస్‌ను వారి సొంత దేశంలో ఓడించడం విండీస్‌కు ఇది మొదటిసారి.