Fri Nov 29 2024 00:03:21 GMT+0000 (Coordinated Universal Time)
మూడో టెస్ట్ ఆసీస్‌దే
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. 76 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం ఒక్క వికెట్లు కోల్పోయి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో భారత్ 2, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచాయి. ఈనెల 9 నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. భారత్ గెలిస్తే సిరీస్ ఇండియా పరమవుతుంది.
నిరాశపర్చిన బ్యాటర్లు...
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్ భారత్ అభిమానులను నిరాశపర్చింది. ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిల్చింది. భారత్ పై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అతి తక్కువ పరుగులే లక్ష్యం ఉండటంతో ఆస్ట్రేలియాదే విజయమని అందరూ అంచనా వేశారు. కానీ స్పిన్నర్లు ఏదైనా అద్భుతం చేస్తారేమోనని భావించారు. ఈ టెస్ట్ లో భారత్ బ్యాటర్లు, బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నాథన్ లైయన్ ఎంపికయ్యారు.
Next Story