Mon Dec 23 2024 07:02:57 GMT+0000 (Coordinated Universal Time)
Glen Maxwell : పూటుగా తాగి.. స్పృహ కోల్పోయి ఆసుపత్రి పాలయి.. స్టార్ క్రికెటర్ విన్యాసాలు
ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్వెల్ మద్యం తాగి స్పృహతప్పి పోయాడు. ఆడిలైడ్ లో జరిగిన విందులో ఈ ఘటన జరిగింది
Glenn Maxwell: ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్వెల్ అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇటీవల భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో మ్యాక్స్ వెల్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. వరల్డ్ కప్ లో జరిగిన ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన మ్యాక్స్ వెల్ కాళ్ల కండరాలు పీకుతున్నా పరుగులు చేస్తూ జట్టును గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడని మ్యాక్స్వెల్ పై ప్రత్యేక అభిమానం. ఆరోజు మ్యాక్స్ వెల్ ఆడిన తీరు క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికీ మరచిపోరు. అలాంటి మ్యాక్స్ వెల్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు.
పార్టీకి హాజరై...
ఒక విందుకు హాజరై పూటుగా తాగి స్పృహకోల్పోయిన మ్యాక్స్ వెల్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని వెళ్లడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆడిలైడ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి మ్యాక్స్ వెల్ హాజరయ్యాడు. అందరితో గడిపాడు. ఆయన వచ్చాడని ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు. అందరికీ ఆటోగ్రాఫ్లు ఇచ్చిన మ్యాక్స్ వెల్ తన ఫ్రెండ్స్ తో కలసి పార్టీ చేసుకున్నాడు. పార్టీ అంటే రెండు, మూడు పెగ్గులు తాగి నేరుగా ఇంటికి వెళ్లాల్సిన మ్యాక్స్ వెల్ దొరికినంత మద్యాన్ని తాగేసినట్లుంది.
ఆసుపత్రికి వెళ్లి...
అందుకే మ్యాక్స్ వెల్ స్పృహతప్పి పడిపోయాడు. ఎంతకూ మ్యాక్స్ వెల్ లేవకపోవడంతో వెంటనే ఆయన స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతిగా మద్యం సేవించినందువల్లనే స్పృహతప్పి పడిపోయారని వైద్యులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రిలో కొద్దిసేపు ఉన్న తర్వాత ఆయన కోలుకుని ఇంటికి వెళ్లాడు. అయితే దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. దీనిపై మ్యాక్స్ వెల్ నుంచి స్పందన కోసం వేచి చూడాల్సి ఉందని బోర్డు అధికారులు చెబుతున్నారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలించాలని నిర్ణయించింది.
Next Story