ఇల్లీగల్ ఫీల్డింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్ ఆటగాడు
శుక్రవారం, 3-మ్యాచ్‌ల ODI సిరీస్‌లో వెస్టిండీస్ 276 పరుగుల ఛేజింగ్ సమయంలో బాబర్ ఆజమ్
పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం ఇల్లీగల్ ఫీల్డింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. ముల్తాన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులను ఇచ్చాడు. శుక్రవారం, 3-మ్యాచ్‌ల ODI సిరీస్‌లో వెస్టిండీస్ 276 పరుగుల ఛేజింగ్ సమయంలో బాబర్ ఆజమ్ ఇల్లీగల్ గా ఫీల్డింగ్ చేస్తూ దొరికిపోయాడు. మహ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ గ్లవ్లలో ఒకదానిని ఉపయోగించి బంతిని సేకరించాడు బాబర్ ఆజమ్. అతడు చేసిన ఈ పనిని గుర్తించిన ఆన్-ఫీల్డ్ అంపైర్లు "చట్టవిరుద్ధమైన ఫీల్డింగ్"గా భావించారు. ఛేజింగ్‌లో వెస్టిండీస్‌కు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. 2వ ODIలో వెస్టిండీస్ చేజింగ్ చేస్తున్న 29వ ఓవర్లో, బాబర్ వికెట్ కీపర్ గ్లౌజులు ధరించి స్టంప్స్ వెనుక బంతిని సేకరిస్తూ కనిపించాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం, "28.1 ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్" వికెట్-కీపర్ కాకుండా ఫీల్డర్ ఎవరూ గ్లోవ్స్ లేదా ఎక్స్టర్నల్ లెగ్ గార్డ్స్ ధరించడానికి అనుమతించబడరు. అదనంగా.. చేతికి లేదా వేళ్లకు రక్షణ అంపైర్ల సమ్మతితో మాత్రమే ధరించవచ్చు.