Mon Dec 23 2024 11:27:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ప్రపంచ కప్ లో డబుల్ ధమాకా
ప్రపంచ కప్ సందడి మొదలైంది. మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు
ప్రపంచ కప్ సందడి మొదలైంది. మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించగా.. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్ జట్టుతో మ్యాచ్ ను కాపాడుకోగలిగింది. ఇక మూడో రోజు రెండు మ్యాచ్ లు అలరించనున్నాయి. బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కాగా.. ఇంకో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక.
ధర్మశాలలో బంగ్లాదేశ్ తో ఆఫ్ఘనిస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఉదయం 10:30కు మొదలుకానుంది. ఈ స్టేడియం పేస్ కు అనుకూలించనుంది. ప్రపంచ కప్ కు ముందు బంగ్లాదేశ్ జట్టును వివాదాలు వెంటాడిన సంగతి తెలిసిందే. తమీమ్ ఇక్బాల్ ప్రపంచ కప్ జట్టులో లేకపోవడంతో, బంగ్లాదేశ్ వివాదాలను పక్కన పెట్టి టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ను విజయంతో మొదలుపెట్టాలని భావిస్తోంది. అండర్‌డాగ్స్‌గా పేరుగాంచిన ఆఫ్ఘనిస్తాన్, టోర్నమెంట్లో పెద్ద పెద్ద జట్లను ఓడించాలని భావిస్తోంది. స్పిన్ కు అనుకూలిస్తే సంచలనాలు సృష్టించడానికి ఆఫ్ఘన్ జట్టు ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు.
ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో నాల్గవ మ్యాచ్‌లో భాగంగా శనివారంనాడు దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లో కూడా మ్యాచ్ ను వీక్షించవచ్చు.
Next Story