Fri Nov 15 2024 01:24:39 GMT+0000 (Coordinated Universal Time)
న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
సొంత గడ్డ మీద బంగ్లాదేశ్ మరోసారి రెచ్చిపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టును
సొంత గడ్డ మీద బంగ్లాదేశ్ మరోసారి రెచ్చిపోయింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టును 150 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ జట్టును రెండో సారి ఓడించింది. గతేడాది న్యూజిలాండ్ పర్యటనలోనూ బంగ్లాదేశ్ జట్టు కివీస్‌కు టెస్టుల్లో ఓటమి రుచి చూపించింది. సిల్హట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 310 పరుగులకు ఆలౌట్ అయింది. కేన్ విలియమ్సన్ సెంచరీ (104)తో రాణించినా.. మిగతా బ్యాటర్లందరినీ బంగ్లాదేశ్ బౌలర్లు పెవిలియన్ పంపించేశారు. దీంతో న్యూజిలాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం మాత్రమే దక్కింది. న్యూజిలాండ్ 317 పరుగులకు ఆలౌట్ అయింది. కేవలం 7 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించింది.
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా బ్యాటర్లలో శాంటో (105) సెంచరీతో అదరగొట్టాడు. అతడికి ముష్ఫికర్ రహీమ్ (67), మెహిదీ హసన్ మిరాజ్ (50) సహకరించారు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 338 పరుగులు చేసింది. ఫలితంగా కివీస్ ముందు 332 పరుగుల లక్ష్యం నిలిపింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన.. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయాడు.నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. చివరి రోజైన శనివారం ఆట ప్రారంభించిన కివీస్ గంటన్నరలోపై చివరి మూడు వికెట్లు కోల్పోయింది. చివరకు 181 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన తైజుల్ ఇస్లాం.. రెండో ఇన్నింగ్సులో 6 వికెట్లు తీశాడు.
Next Story