Mon Dec 15 2025 06:33:54 GMT+0000 (Coordinated Universal Time)
బీసీసీఐలో మొదలైన ఎన్నికల సందడి
బీసీసీఐ కార్యవర్గం వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఇటీవల సుప్రీంకోర్టు

బీసీసీఐ కార్యవర్గం వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఇటీవల సుప్రీంకోర్టు ఓకే చెప్పడమే కాకుండా బీసీసీఐ రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీసీసీఐ ఆఫీసు బేరర్ల పదవుల కోసం అక్టోబరు 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 18న ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు కూడా అదే రోజున వెల్లడిస్తారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఎన్నికల సీజన్ అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల అధికారి షెడ్యూల్‌ను ప్రకటించారు. శనివారం (సెప్టెంబర్ 24) రాష్ట్ర సంఘాల మధ్య పంపిణీ చేయబడిన ఏడు పేజీల నోటిఫికేషన్ లో బీసీసీఐ ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. BCCI వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) అక్టోబర్ 18న ముంబైలో జరుగుతుంది. ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా వ్యవహరిస్తున్నారు.
ప్రతినిధిని నామినేట్ చేయడానికి దరఖాస్తులను ఫైల్ చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 24
సభ్యులు తమ ప్రతినిధిని నామినేట్ చేయడానికి దరఖాస్తులను ఫైల్ చేయడానికి చివరి తేదీ: అక్టోబర్ 4
డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ విడుదల: అక్టోబర్ 5
డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌లోని పేర్లపై అభ్యంతరాల సమర్పణ: అక్టోబర్ 6 & 7
అభ్యంతరాలు, నిర్ణయాల పరిశీలన.. తుది ఓటర్ల జాబితా విడుదల: అక్టోబర్ 10
నామినేషన్ దరఖాస్తును ఫైల్ చేయడానికి విండో (వ్యక్తిగతంగా దాఖలు చేయాలి): అక్టోబర్ 11 & 12
నామినేషన్ దరఖాస్తుల పరిశీలన: అక్టోబర్ 13
చెల్లుబాటు అయ్యే నామినేట్ అభ్యర్థుల జాబితా ప్రకటన: అక్టోబర్ 13
నామినేషన్ల ఉపసంహరణ (వ్యక్తిగతంగా): అక్టోబర్ 14
పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటన: అక్టోబర్ 15
BCCI ఎన్నికలు: అక్టోబర్ 18
ఫలితాల ప్రకటన: అక్టోబర్ 18
Next Story

