Mon Dec 23 2024 07:30:22 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఉప్పల్ కు వచ్చేయండిక
హైదరాబాద్ వాసులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియా - ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
హైదరాబాద్ వాసులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియా - ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ నెల 25 నుంచి ఇండియా - ఇంగ్లండ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ లో ఇంగ్లండ్ తో ఇండియా మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను ఆడనుంది.
తొలి మ్యాచ్ కోసం...
ఇందులో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంని ఎంపిక చేయడంతో అభిమానులకు ఇక ఇండియన్ క్రికెటర్లు అతి దగ్గరగా చూస్తూ ఆటను వీక్షించే అవకాశం మరోసారి లభించినట్లయింది. అయితే ఈ మ్యాచ్ కోసం త్వరలోనే టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సమీక్షించారు. భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు.
Next Story