Thu Apr 24 2025 00:11:40 GMT+0000 (Coordinated Universal Time)
రికీ పాంటింగ్, లాంగర్ చెప్పిందంతా అబద్ధాలేనా?
రికీ పాంటింగ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి

భారత మెన్స్ క్రికెట్ జట్టు పదవి కోసం తమను సంప్రదించారంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. భారత జాతీయ జట్టు ప్రధాన కోచ్ పాత్ర కోసం తాము ఏ ఆస్ట్రేలియన్‌ని సంప్రదించలేదని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు. వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో (USA) జరగనున్న T20 ప్రపంచ కప్ 2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుండడంతో భారత బోర్డు ఇటీవల కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి గడువు మే 27 సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
BCCI భారత జట్టు కోచ్ పదవి కోసం 2 సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, జై షా మీడియా కథనాలను ఖండించారు. ఉద్యోగానికి సరైన అభ్యర్థిని కనుగొనడానికి నిర్దిష్ట ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేను లేదా బీసీసీఐ ఏ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ను కోచింగ్ ఆఫర్‌తో సంప్రదించలేదు.. కొన్ని మీడియా విభాగాల్లో ప్రసారం అవుతున్న నివేదికలు పూర్తిగా అవాస్తమని అన్నారు. మన జాతీయ జట్టుకు సరైన కోచ్‌ని నియమించడం కోసం చాలా ఖచ్చితమైన, సమగ్రమైన ప్రక్రియ ఉంటుందని అన్నారు. మేము భారత క్రికెట్ నిర్మాణంపై లోతైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తులను గుర్తించడంపై దృష్టి సారించామన్నారు.
Next Story