Fri Nov 22 2024 07:52:04 GMT+0000 (Coordinated Universal Time)
ఆ స్టార్స్ ను పక్కన పెడుతూ టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్‌తో తలపడబోయే భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లను విండీస్ టూర్ కోసం ఎంపిక చేసింది.
వెస్టిండీస్‌తో తలపడబోయే భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లను విండీస్ టూర్ కోసం ఎంపిక చేసింది. ఈ జట్టుకు భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐపీఎల్ లో రాణించిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముఖేష్ కుమార్‌లకు చోటు దక్కింది. ఇండియా- వెస్టిండీస్ మధ్య ఆగష్టు 3 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మూడు మ్యాచ్‌లు విండీస్ లో జరగనుండగా, చివరి రెండు టీ20లు అమెరికా వేదికగా జరగనున్నాయి. హైదరాబాద్ ఆటగాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో ముంబై ఇండియన్స్ (MI) తరఫున అద్భుతంగా రాణించిన ఎడమచేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ భారత జట్టులో స్థానం సంపాదించాడు.
ఐపీఎల్ 2023లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న యశస్వి జైస్వాల్ కూడా టీమిండియాకు ఎంపికయ్యాడు. పేస్ బౌలింగ్ ఎటాక్‌లో ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువరక్తం ఉంది. యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు కాగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను కూడా ఎంపిక చేశారు. స్టార్ ఆటాగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పక్కన పెట్టింది సెలెక్షన్ కమిటీ.
భారత జట్టు(టీ20): హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
Next Story