Tue Nov 05 2024 07:51:58 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. మూడో టీ20కి ప్రేక్షకుల అనుమతి
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ చీఫ్ అవిషేక్ దాల్మియాకు పంపిన ఇమెయిల్‌లో, "మీ అభ్యర్థన
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ - వెస్టిండీస్ ల మధ్య ఇప్పటికే రెండు టీ 20 మ్యాచ్ లు జరగగా.. వాటిని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులను గ్రౌండ్ లోకి అనుమతించలేదు. ఫిబ్రవరి 20వ తేదీన జరిగే మూడో టీ20 మ్యాచ్ కి ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది బీసీసీఐ. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్ కు 20 వేల మంది ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే.. వీరిలో ఎక్కువ మంది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) లో సభ్యులే ఉన్నట్లు సమాచారం.
Also Read : ఘోర ప్రమాదం : ఆటోని ఢీ కొట్టిన లారీ
బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ చీఫ్ అవిషేక్ దాల్మియాకు పంపిన ఇమెయిల్‌లో, "మీ అభ్యర్థన మేరకు, వెస్టిండీస్‌తో జరిగే చివరి టీ20 మ్యాచ్‌కి ప్రేక్షకులను అనుమతించాలని, ఆఫీస్ బేరర్లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం" అని తెలిపారు. కాగా దాల్మియా ఈడెన్ గార్డెన్స్ లోని సీటింగ్ కెపాసిటీలో 70 శాతం ప్రేక్షకులను అనుమతించాలని అభ్యర్థించారు. ఈ మేరకు CAB సభ్యులకు చెల్లుబాటయ్యే యూనిట్ లకు ఫ్రీ టికెట్లను జారీ చేయనుంది. తమ అభ్యర్థన మేరకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందుకు దాల్మియా బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపారు.
Next Story