Fri Nov 22 2024 11:30:37 GMT+0000 (Coordinated Universal Time)
ఐసీసీకి చెప్పేసిన బీసీసీఐ.. ఇక పాక్ ఏమి చేస్థుందో?
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ పాకిస్థాన్ వెళ్లబోదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి మౌఖికంగా తెలియజేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8 జట్లు ఆడనున్నాయి. టోర్నమెంట్‌ను నిర్వహించే హక్కు 2025లో పాకిస్థాన్‌కు దక్కింది. భారత క్రికెట్ జట్టును ఎలాగైనా పాక్ కు రప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కానీ ఆ విషయంలో బీసీసీఐ ఎలాంటి గుడ్ న్యూస్ పాకిస్థాన్ కు చెప్పలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హైబ్రిడ్ మోడల్లో భారత్ మ్యాచ్‌లు ఆడబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు తాము అంగీకరించలేదని పాకిస్థాన్ అంటోంది. పాకిస్తాన్‌కు వెళ్లడంలో భారత్‌కు ఏవైనా సమస్యలు ఉంటే వ్రాతపూర్వకంగా ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు అంటోంది.
భారత్-పాక్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత్ పాకిస్థాన్ లో పర్యటన చేయకూడదని నిర్ణయించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నవంబర్ 11న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ప్రకటించనుందని వార్తలు వచ్చిన తరుణంలో బీసీసీఐ ఐసీసీకి ఓ క్లారిటీ ఇచ్చింది. ఎనిమిది జట్ల టోర్నీకి వేదికలను నిర్ధారించకుండానే ICC షెడ్యూల్‌ను ప్రకటించాలని అనుకుంది.
Next Story