Sat Dec 21 2024 11:05:49 GMT+0000 (Coordinated Universal Time)
షమీ చేతికి గాయం.. బంగ్లా టూర్ కు?
బంగ్లాదేశ్ తొలి వన్డే కు ముందు భారత్ కు షాక్ తగిలింది. భారత్ పేసర్ మహ్మద్ షమీ గాయాలపాలయ్యాడు.
భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య రేపటి నుంచి వన్డే మ్యాచ్ సిరీస్ ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటికే టీ ఇండియా ప్లేయర్లు బంగ్లాదేశ్ కు చేరుకున్నారు. అయితే బంగ్లాదేశ్ తొలి వన్డే కు ముందు భారత్ కు షాక్ తగిలింది. భారత్ పేసర్ మహ్మద్ షమీ గాయాలపాలయ్యాడు.
వన్డే మ్యాచ్ లకు...
బంగ్లాదేశ్ కు వెళ్లేముందు ప్రాక్టీస్ చేస్తుండగా షమీ చేతికి బలమైన గాయం అయినట్లు బీసీసీఐ తెలిపింది. రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో బంగ్లాదేశ్ తో జరిగే మూడు వన్డే మ్యాచ్ లకు షమి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం షమి నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండి చికిత్స పొందుతున్నాడు. టెస్ట్ సిరీస్ కు షమీ అందుబాటులోకి రావాలని టీం ఇండియా కోరుకుంటుంది.
Next Story