Mon Dec 23 2024 14:40:27 GMT+0000 (Coordinated Universal Time)
టీం ఇండియా అద్భుత విజయం
వరల్డ్ కప్ కు ముందు సొంత గడ్డపై టీం ఇండియా అద్భుత ఆస్ట్రేలియాపై ప్రదర్శన చేసింది
ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ కు ముందు సొంత గడ్డపై టీం ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. టీం ఇండియా ఆటగాళ్లు తమ పెరఫార్మెన్స్తో ప్రపంచ మేటి జట్టును మట్టి కరిపించారు. ఆస్ట్రేలియాలతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో 99 మ్యాచ్ ల పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-0 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ నామమాత్రంగానే జరగనుంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు చెలరేగిపోయారు. గిల్ 104 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 105 పరుగులు చేశాడు.
భారత్ బౌలర్లు...
దీంతో వరసగా భారత్ జట్టుకు ఏడో విజయంగా మారింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 399 పరుగులు చేసింది. అయితే వర్షం పడటంతో మ్యాచ్ ను కుదించారు. అయినా 28.2 ఓవర్లకే భారత్ బౌలర్లు ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ రెండు, అశ్విన్ మూడు, జడేజా మూడు పరుగులు తీసి ఆస్ట్రేలియాను చావు దెబ్బతీశారు. దీంతో భారత్ ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది.
Next Story