Mon Apr 07 2025 03:50:58 GMT+0000 (Coordinated Universal Time)
నిన్న భారత్ - పాక్ మ్యాచ్ ను ఎంతమంది చూశారో తెలుసా?
ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత్ - పాక్ మ్యాచ్ ను కోట్లాది మంది చూశారు.

భారత్ - పాక్ మ్యాచ్ అంటే ఇక చూసే వాళ్లకు కొదవ ఉండదు. రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా, ఉత్కంఠగా చూస్తారు. స్టేడియానికే మాజీ క్రికెటర్లు వచ్చారంటే ఈ మ్యాచ్ కు ఏ రకమైన క్రేజ్ ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత్ - పాక్ మ్యాచ్ ను కోట్లాది మంది చూశారు.
అందుకే ఆదివారం...
అందుకే ఐసీసీ కూడా పాక్ - భారత్ మ్యాచ్ ను అందరికీ సెలవు దినమైన ఆదివారం రోజు పెట్టింది. భారత్ లో క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటంతో వ్యూయర్ షిప్ ఎక్కువగా ఉంటుందని భావించి ఈ రకంగా చర్యలు తీసుకుంటుంది. వచ్చే నెల రెండోతేదీ ఆదివారం కూడా భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్ ను ఫిక్స్ చేసింది. నిన్న పాక్ తో భారత్ జరిగిన మ్యాచ్ ను నాలుగు వందల మిలియన్లకు పైగానే వివిధ రూపాల్లో వీక్షించారని చెబుతున్నారు. టీవీల్లో దాదాపు 180 మిలయన్ల మంది, డిస్నీ హాట్ స్టార్ యాప్ ద్వారా 225 మిలయన్ల మంది వీక్షించారని తెలిసింది.
Next Story