Mon Dec 23 2024 02:42:33 GMT+0000 (Coordinated Universal Time)
బౌలర్లదే పైచేయి.. లంక తక్కువ స్కోరుకే
భారత్ - శ్రీలంక వన్డే మ్యాచ్ లో బౌలర్లు రెచ్చిపోయారు. అతి తక్కువ స్కోరుకే శ్రీలంక బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించారు
భారత్ - శ్రీలంక వన్డే మ్యాచ్ లో ఇండియా బౌలర్లు రెచ్చిపోయారు. అతి తక్కువ స్కోరుకే శ్రీలంక బ్యాటర్లను పెవిలియన్ దారి పట్టించారు. దీంతో అతి తక్కువ స్కోరుకు శ్రీలంక ఆల్ అవుట్ అయింది. 215 పరుగులు చేసిన శ్రీలంక ఆల్ అవుట్ కావడంతో భారత్ లక్ష్యం 216 పరుగులు చేయాల్సి ఉంది. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ చొప్పున తీసుకోవడంతో శ్రీలంక కుప్పకూలిపోయంది. వన్డే మ్యాచ్ లో అతి తక్కువ స్కోరును నమోదు చేసింది. గిల్ నువనిడు ఫెర్నాండోను రనౌట్ చేశాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.
నిలకడగా ఆడుతున్న....
టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. లంక బ్యాటర్లలో నువినిడు ఫెర్నాండో అత్యధికంగా యాభై పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. కుశాల్ మెండిస్ 34 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ నిలకడగా ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో ముప్ఫయి పరుగులు చేశారు. రోహిత్ 15, గిల్ 12పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే నాలుగో ఓవర్ లో రోహిత్ శర్మ అవుటయ్యాదు. అనంతరం శుభమన్ గిల్ కూడా అవుటయ్యాడు ప్రస్తుతం భారత్ స్కోరు రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది.
Next Story