Mon Nov 18 2024 05:54:11 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడు యువరాజ్ 36 పరుగులు.. ఇప్పుడు ఏకంగా 35 పరుగులు
ఈ రోజు మరోసారి ఆ రోజులను బ్రాడ్ కు భారత జట్టు గుర్తు చేసింది.
స్టువర్ట్ బ్రాడ్.. ఈ పేరు వింటే చాలు యువరాజ్ సింగ్ టీ20 ప్రపంచకప్ లో కొట్టిన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు తప్పకుండా గుర్తుకు వస్తాయి. ఈ రోజు మరోసారి ఆ రోజులను బ్రాడ్ కు భారత జట్టు గుర్తు చేసింది. భారతజట్టు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బాదడంతో ఏకంగా 35 పరుగులు వచ్చాయి. బ్రాడ్ బౌలింగ్ లో బుమ్రా బ్యాటింగ్ చేయడానికి రాగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 Wd5 N6 4 4 4 6 1 ఇలా ఏకంగా 35 పరుగులు భారత జట్టు పిండుకుంది. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్ గా ఇది నిలిచింది.
ఇక మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 416 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్ లో పంత్, రవీంద్ర జడేజాలు సెంచరీలతో కదం తొక్కారు. మొదటి రోజు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఏమాత్రం కలిసి రాలేదు. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. శుభమన్ గిల్ (17), పుజారా (13), హనుమ విహారి (20) తీవ్రంగా నిరాశ పరిచారు. కోహ్లీ 19 బంతులు ఆడిన విరాట్ 11 పరుగులు మాత్రమే చేసి మ్యాటీ పాట్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఇక రెండో రోజు మొదటి గంట చాలా వేగంగా సాగింది. భారత ఆటగాళ్లు వేగంగా పరుగులు చేయడం మొదలు పెట్టడంతో 416 పరుగులు చేసింది భారత్. జడేజా 194 బంతుల్లో 104 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొహమ్మద్ షమీ 16 పరుగులు చేయగా.. బుమ్రా 31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆండర్సన్ 5 వికెట్లు తీశాడు.
Next Story