Fri Jan 10 2025 14:43:17 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్.. పెద్ద రిస్క్
ప్రపంచ కప్ సూపర్-12 కు ముందు పలు జట్లను గాయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరుగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఆటగాడు, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ గాయపడ్డాడు. గోల్ఫ్ ఆడుతూ ఇంగ్లిస్ గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇంగ్లిస్.. బుధవారం ఉదయం గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు అది తీవ్రమైందని తేల్చారు. దీంతో ఈనెల 22న ఆ జట్టు న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో ఇంగ్లిస్ దూరం కానున్నాడని ఆస్ట్రేలియా తెలిపింది. ఆస్ట్రేలియా జట్టులో రెగ్యులర్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఉన్నా అతడికి స్టాండ్ బై గా ఇంగ్లిస్ ను ఎంపిక చేశారు.
అతడి స్థానంలో కామెరాన్ గ్రీన్ ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా15 మంది సభ్యుల జట్టులో బ్యాకప్ వికెట్‌కీపర్ లేడు. మాథ్యూ వేడ్ గాయపడినట్లయితే అతని స్థానంలో మరొకరిని తీసుకోవచ్చు. అదే మ్యాచ్ ఆడుతూ వేడ్ గాయపడితే మాత్రం ఆసీస్ కు చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అలా జరిగితే డేవిడ్ వార్నర్ కీపింగ్ చేసే అవకాశం ఉంది.. ఎందుకంటే గతంలో 2014లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌లో వార్నర్ కీపింగ్ కొనసాగించాడు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఓ సందర్భంలో BBLలో కీపింగ్ చేశాడు.
Next Story