Mon Dec 23 2024 06:19:24 GMT+0000 (Coordinated Universal Time)
రోహిత్ శర్మకు కరోనా
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకింది. రోహిత్ కు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకింది. రోహిత్ కు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. టీం ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. గత ఏడాది నిలిచిపోయిన ఐదో టెస్ట్ ప్రారంభం కావాల్సి ఉండగా రోహిత్ శర్మకు కరోనా సోకడం టీంను షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ బస చేసిన హోటల్ గదిలోనే క్వారంటైన్ లో ఉన్నాడని, బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలపారు.
టీం ఇండియా ఆటగాళ్లకు...
ఇంగ్లండ్ వెళ్లిన రోహిత్ వార్మప్ మ్యాచ్ లోనూ పాల్గొన్నాడు. దీంతో టీం ఇండియా ఆటగాళ్లందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడి ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా ఉన్నారు. వరసగా టీం ఇండియా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story