Thu Apr 10 2025 04:29:25 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Pak Champions Trophy :పాక్ కు ప్రాణ సంకటం.. ఇండియాకు చెలగాటం
భారత్ - పాకిస్థాన్ మధ్య ఛాంపియన్ ట్రోఫీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది.

భారత్ - పాకిస్థాన్ మధ్య ఛాంపియన్ ట్రోఫీ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దుబాయలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డై అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలయింది. దీంతో ఆ జట్టు ఇండియామీద తప్పక గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పాక్ ఓడిపోతే ఇక ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. అందుకే అది తీవ్ర వత్తిడిలో ఉంది.
తొలి మ్యాచ్ గెలవడంతో...
ఇక భారత్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ పై కొంత కష్టపడినా గెలిచి పాయింట్ల పట్టికలో బాగానే ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ కు కలసి వచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ ఫుల్లు ఫామ్ లో ఉన్నాడు. అతడు గాయాల పాలు కావడంతో ఈ మ్యాచ్ లో ఆడకపోవడం కొంత లాభించే అంశంగానే చూడాలి. పాక్ పై ఇప్పటి వరకూ ఎక్కువ మ్యాచ్ లు గెలిచిన భారత్ ఈసారి కూడా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు చేరాల్సిన శ్రమ పడకుండా చేరే అవకాశాలున్నాయి. అందుకే ఈ మ్యాచ్ లో భారత్ సునాయాసంగా ఆడే అవకాశాలున్నాయి.
బ్యాటింగ్, బౌలింగ్ లో...
భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా ఉండటం సానుకూలంగా చూడాలి. రెండుజట్లను పరిగణనలోకి తీసుకుంటే భారత్ కే విజయావకాశాలు ఎక్కువని అందరూ చెబుతున్నారు. సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఫామ్ లోకి రావడంతో కొంత ఫ్యాన్స్ కు ఊరట కలిగించే అంశమే. విరాట్ కోహ్లికి పాక్ పై మంచి రికార్డు ఉండటంతో కోహ్లి సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో బౌలర్లు కూడా షమి, అర్షదీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాలు, హార్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తిలో ఎవరైనా సరే వికెట్లు తీయడంలో ముందుంటారు. అదే భారత్ కు బలం. పాకిస్థాన్ ను కూడా తక్కువగా అంచనా వేయకపోయినా అన్ని రకాలుగా సన్నద్ధమై ఎటువంటి వత్తిడి లేకుండాఆడాలని కోరుకుందా.
Next Story