Fri Dec 20 2024 21:52:44 GMT+0000 (Coordinated Universal Time)
Champions Trophy: పరిహారం చెల్లిస్తారా? పాక్కు వెళతారా?
ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి పాక్ లో జరిపేందుకు నిర్ణయించింది. ఈ ట్రోఫీకి భారత్ జట్టు వెళుతుందా? లేదా? అన్న సందేహం నెలకొంది
ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి పాక్ లో జరిపేందుకు నిర్ణయించింది. దీంతో ఈ ట్రోఫీకి భారత్ జట్టు వెళుతుందా? లేదా? అన్న సందేహం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే ఆసియా కప్ను పాకిస్థాన్ నిర్వహిస్తామని చెప్పినా భద్రత కారణాలు చెప్పి భారత్ పాక్ కు వెళ్లలేమని చెప్పడంతో అప్పట్లో వేదికను శ్రీలంకకు మార్చారు. దీంతో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ లో నిర్వహించాలని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ భారత్ పర్యటనపై సందిగ్దత కొనసాగుతుంది.
భద్రత కారణాలు చూపి...
అయితే పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు మాత్రం తమ దేశానికి ఆడేందుకు భారత్ రాకపోతే బీసీసీఐ పరిహారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ ఆతిధ్య హక్కుల పత్రంపై భారత్ సంతకం చేయని కారణంగా పీసీబీ భారత్ రాకపై అనుమానిస్తుంది. భారత్ భద్రత కారణాలు చూపి వచ్చేందుకు వెనకడుగు వేస్తే మాత్రం సెక్యూరిటీని ప్రయివేటు సంస్థకు అప్పగించాలని పీసీబీ ఐసీసీని కోరింది. గత రెండేళ్లలో పాకిస్థాన్ లో అన్ని జట్లు పర్యటించాయన్న విషయాన్ని కూడా పీసీబీ గుర్తు చేసింది. భారత్ పర్యటించకపోతే ఐసీసీ పరిహారం చెల్లిస్తుందా? లేదా? అన్నది చూడాలి.
Next Story