Sun Apr 27 2025 04:48:26 GMT+0000 (Coordinated Universal Time)
Chamipions Trophy : చిన్న దేశమైనా పెద్ద బ్యాట్ తో కొట్టాల్సిందే
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అయింది. నేడు భారత్ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరుగుతుంది

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అయింది. నేడు భారత్ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరుగుతుంది. ఎ గ్రూపులో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ లు ఉన్నాయి. భారత్ జట్టు ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఎదుర్కొనాల్సి ఉంటుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు దేశాలపై గెలిస్తే సెమీ ఫైనల్స్ కు చేరే అవకాశాలున్నాయి. లేకుంటే పరిస్థితులు సంక్లిష్టంగా మారతాయి. అప్పడు ఇతర మ్యాచ్ ల అపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు మరింత టెన్షన్ తప్పదు. అందుకే తొలి నుంచి విజయం సాధించాలంటే బంగ్లాదేశ్ తోనే ఆరంభం అదిరేలా చూసుకోవాలి. తర్వాత మ్యాచ్ లు పాకిస్థాన్, న్యూజిలాండ్ పై కూడా గెలుపు కోసం శ్రమించాల్సి ఉంటుంది.
గణాంకాలు మనవైపే ఉన్నా...
గతంలో బంగ్లాదేశ్ పై టీం ఇండియా సాధించిన విజయాల గణాంకాలు మనవైపు మొగ్గు చూపుతున్నప్పటికీ ఆ టీంలో కూడా గేమ్ ఛేంజర్ లు ఉన్నారు. బంగ్లా ఆటగాళ్లు నిలదొక్కుకున్నారంటే ఇక అంత సులువుగా క్రీజును వదలరు. అలాగే బౌలింగ్ లోనూ అది రాటు దేలింది. ఊహించని విధంగా రైజ్ అయ్యే జట్టు అది. అందుకే చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకూ టీం ఇండియా - బంగ్లాదేశ్ లు వన్డే ఫార్మాట్ లో 41 సార్లు తలపడగా 31 సార్లు టీం ఇండియా గెలిచినప్పటికీ, ఎనిమిది సార్లు బంగ్లా గెలిచిన విషయాన్ని మర్చిపోకూడదు. 2023 వన్డే ప్రపంచ కప్ లోనూ బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించినప్పటికీ అప్పటికీ ఇప్పటికీ ఆ జట్టు బలపడిందనే చెప్పాలి.
వాతావరణం...
ఆసియా కప్ లో బంగ్లాదేశ్ జట్టు భారత్ జట్టును ఓడించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 2023లో వారి గడ్డపై జరిగిన వన్డే సిరీస్ లోనూ భారత్ ను బంగ్లాదేశ్ ఓడించింది. ఇలా అనే గణాంకాలు భయపెట్టే విధంగానే ఉన్నాయి. అందుకే ఆచితూచి ఆడాల్సి ఉంది. భారత్ నేటి మ్యాచ్ లో ముగ్గురి స్పిన్నర్లతో దిగే అవకాశముంది. అయితే మరో ముప్పు పొంచి ఉంది. అకాల వర్షం పడే సూచనలు దుబాయ్ లో ఉందని వాతావరణ శాఖ భయపెడుతోంది. మ్యాచ్ వర్షంతో నిలిచిపోయినా ఇరవై ఓవర్లు ఆడించేవిధంగా సిద్ధంగా ఉన్నారు. అదే జరిగినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా రద్దయితే చెరొకపాయింట్ మాత్రమే లభిస్తుంది. అది భారత్ సెమీస్ అవకాశాలను సన్నగిల్లేలా చేస్తాయి. అందుకే సీనియర్లు మరింతగా రాణించి చిన్న దేశాన్నైనా బ్యాట్ తో కొట్టాలన్నది క్రీడానిపుణుల అభిప్రాయంగా ఉంది.
Next Story