Sun Apr 27 2025 23:45:26 GMT+0000 (Coordinated Universal Time)
Chamipions Trophy : మోత మోగించే వారేరీ? అనుమానాలన్నీ వారివైపే?
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీలో భారత్ జట్టు ఫేవరెట్ గా బయటకు కనిపిస్తున్నా ఎన్నో అనుమానాలు

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీలో భారత్ జట్టు ఫేవరెట్ గా బయటకు కనిపిస్తున్నా ఎన్నో అనుమానాలు. ఎన్నో సందేహలు. నిలకడలేని బ్యాటింగ్ తో నిత్యం టెన్షన్ పెట్టే సీనియర్లు, జూనియర్ ఆటగాళ్లపై వత్తిడి ఇలా ఏ ఒక్క మ్యాచ్ ఏ గ్రూపులో ఓటమి పాలయినా సెమీసీ ఆశలు దాదాపు గల్లంతయినట్లేనని క్రీడానిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ మొన్న ఇంగ్లండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లలో సెంచరీ సాధించినా అది ఒక్క మ్యాచ్ లోనే రాణించారు. మిగిలిన మ్యాచ్ లలో విఫలమయ్యాడు. అలాగే విరాట్ కోహ్లి కూడా ఒక మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అంతే తప్ప మిగిలిన మ్యాచ్ లలో నిరాశ పరచాడు. మరో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా మూడు మ్యాచ్ లలో చచ్చీ చెడీ నలభై కొట్టి వెనుదిరిగి వెళ్లాడు.
సరైన ప్రాక్టీస్ లేకపోవడం...
ఈ గణాంకాలు చూసిన వారికి ఎవరికైనా నమ్మకం ఎలా ఉంటుంది? దీనికి ప్రధాన కారణం వన్డే మ్యాచ్ లలో సరైన ప్రాక్టీస్ లేకపోవడమేనని, అలాగే మిగిలిన దేశాల తరహాలో అతి తక్కువ గా ఆడారు. మిగిలిన దేశాలు టీ20 తో పాటు టెస్ట్, వన్డే మ్యాచ్ లు సమానంగా ఆడగా, టీం ఇండియా మాత్రం కేవలం టీ20పైనే ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ తో పాటు టీ20 ఫార్మాట్ లలో దుమ్మురేపుతున్న టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ లలో, వన్డే మ్యాచ్ లలో మాత్రం సరిగా రాణించలేకపోతుంది. దూకుడుగా ఆడలేకపోతుంది. అన్ని ఫార్మాట్లకు టీం ఇండియా స్క్కాడ్ వేరు అయినా సీనియర్ ఆటగాళ్లు గతంలో ఉన్నారన్న భరోసా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అది మచ్చుకైనా కనిపించడం లేదు.
గ్రూప్ ఎలో ఉన్న....
గ్రూప్ ఏ లో ఉన్న బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ తో ఆటంటే ఆషామాషీ కాదు. ఈ దేశాల ఆటగాళ్లను అంత తేలిగ్గా తీసుకునే వీలులేదు. ఒక్కసారి క్రీజులో నిలబడి బ్యాట్ కు పనిచెప్పారంటే బౌలర్ల పనిపడతారు. ప్రధానంగా మనోళ్లు అన్ని మ్యాచ్ లు దుబాయ్ లోనే ఆడుతున్నారు. అక్కడి మైదానాలన్నీ నెమ్మదిగా ఉంటాయని, ఎక్కువ పరుగులు చేయడం కష్టంగా మారుతుందని క్రీడానిపుణులు చెబుతున్నారు. ఇక్కడ టాస్ గెలిచిన జట్లు ఎక్కువసార్లు గెలిచాయి. పథ్నాలుగు సార్లు తొలిసారి బ్యాటింగ్ చేసిన జట్లు గెలిస్తే, 19 సార్లు ఛేదనలోకి దిగిన జట్లు ఓటమి పాలయ్యాయి. అంటే ఇక్కడ టాస్ గెలిచిన జట్లు తొలుత బ్యాటింగ్ ను ఎంచుకోవడం మామూలు విషయం. ఇలా అన్ని కలసి వస్తేనే మనకు శుభారంభం. లేకుంటే సెమీస్ కు కూడా వెళ్లడం కష్టమే. అందుకే ఆచితూచి... ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంటుందని క్రీడానిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా టీం ఇండియా వరస గెలుపుతో ఛాంపియన్ గా నిలవాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టీం ఇండియా.
Next Story