Mon Apr 07 2025 16:48:40 GMT+0000 (Coordinated Universal Time)
Team India : ఏమి సెలక్షన్ గురూ... ఆట కాదు.. రాజకీయాలేనా? సమర్పించడానికేనా?
ఛాంపియన్స్ ట్రోఫికీ టీం ఇండియా జట్టును ప్రకటించారు

ఛాంపియన్స్ ట్రోఫికీ టీం ఇండియా జట్టును ప్రకటించారు. ఈ జట్టును చూసిన వారికి ఎవరికైనా ఇందులో ఖచ్చితంగా ఆటగాళ్లకు కాకుండా రాజకీయాలకు ఎక్కువగా చోటు కల్పించినట్లు స్పష్టంగా తెలుస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నార్త్ ఇండియా లాబీయింగ్ బలంగా పనిచేయడంతోనే ఈ జట్టు కూర్పు ఉందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫామ్ లో లేని ఆటగాళ్లను ఎంపిక చేసి, బ్యాట్ తో వీరవిహారం చేసే వారిని పక్కన పెట్టారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ముందే అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమయినట్లు కనిపిస్తుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి.
ఆపసోపాలు పడే వారిని...
అందరూ ఆడలేని వారే. మైదానంలో ఆపసోపాలు పడే వారే. బ్యాట్ ఎత్తడం కూడా కష్టంగా ఉన్న వారే. వికెట్లను తమకు తాము సులువుగా సమర్పించుకునే వారే. ఫామ్ లో లేని సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయడమే అది పెద్ద తప్పిదంగా ఎంపిక తర్వాత వినపడుతున్న కామెంట్స్. అస్సలు గెలిచే ఉద్దేశ్యం ఈ టీం ఎంపికను చూస్తే లేనట్లుందన్న అభిప్రాయం మాజీ ఆటగాళ్లలో కూడా వ్యక్తమవుతుందంటే సెలక్టర్లు ఎందుకు ఇలా చేశారన్న దానిపై ప్రశ్నించేందుకు కూడా అవకాశం లేని పరిస్థితుల్లో క్రికెట్ ప్రేమికులందరూ కప్పు మన నుంచి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడం మినహా మరేమీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అసలుసిసలైన ఆటగాళ్లను పక్కన పెట్టి సీన్ అయిపోయిందని తామే ఆట ద్వారా నిరూపించుకుంటున్న వారిని ఎంపిక చేయడంతోనే ఓటమి అంచుకు జారిపోయినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
బలమైన జట్లతో పోటీ ఎలా?
ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కెప్టెన్ గా మళ్లీ ఫాంలో లేని రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. అలాగే విరాట్ కోహ్లి కూడా ఆడలేని పరిస్థితుల్లో మళ్లీ ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్ కూడా ఫామ్ లో లేడు. ఈ ట్రోఫీలో బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్లు పోటీ పడుతున్నాయి. టీంల ఎంపిక చూసిన తర్వాత అత్యంత బలహీనమైన జట్టుగా భారత్ మాత్రమే కనిపిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కనీసం ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ కు చేరే అవకాశాలున్నాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక తెలుగు ఆటగాళ్లకు ఒక్కరికీ ఇందులో ఛాన్స్ దక్కలేదు. దక్షిణాదిన ఉన్న తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సిరాజ్, సంజూ శాంసన్ వంటి వారికి కూడా చోటు దక్కలేదు. ఇలా టీం ఇండియా జట్టు కూర్పులో పొలిటికల్ ప్లే ఎక్కువగా కనపడుతుందన్న నెగిటివ్ కామెంట్స్ కు మరి బీసీసీఐ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.
ఇండియా స్వ్కాడ్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ ( వైఎస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్), రవీంద్రా జడేజా
Next Story