Mon Dec 23 2024 03:39:15 GMT+0000 (Coordinated Universal Time)
బంగారు పతకం సాధించిన సింధు
పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో.. బంగారు పతకం సాధించిన సింధు
కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో పీవీ సింధు బంగారు పతకం సాధించింది. ఫైనల్స్ లో సింధు కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘనవిజయం సాధించింది. సింధు 13వ ర్యాంక్ లో ఉన్న ప్రత్యర్థిని 21-15, 21-13 తేడాతో ఓడించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు అలవోకగా విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. భారత్ ప్రస్తుతం 56 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ పతకాల పట్టికలో 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలు ఉన్నాయి.
సింధు సాధించిన విజయంపై ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సింధును సోషల్ మీడియా వేదికగా అభినందించారు. కామన్వెల్త్ గేమ్స్ ఈవెంట్లో సింగిల్స్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత పీవీ సింధు అద్భుతంగా ఆడి ఛాంపియన్గా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు బర్మింగ్హామ్లో జరిగిన ఫైనల్లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీపై సింధు సునాయాసంగా విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
News Summary - Commonwealth Games 2022 PV Sindhu wins maiden singles gold
Next Story