Mon Dec 23 2024 12:07:22 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ప్రపంచ కప్ లో సెమీఫైనల్ చేరే జట్లు ఇవే అంటున్న యువరాజ్
2023 ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతూ ఉన్నాయి. అక్టోబర్ 5 న
2023 ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతూ ఉన్నాయి. అక్టోబర్ 5 న మెయిన్ టోర్నమెంట్ ప్రారంభమవుతూ ఉండగా.. మరో వైపు ప్రాక్టీస్ మ్యాచ్ లు కీలకంగా మారాయి. ఈసారి టైటిల్ను ఎవరు సొంతం చేసుకుంటారో అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సెమీ ఫైనల్ చేరడంపై అన్ని జట్లూ ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇక పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచ కప్ సెమీ ఫైనల్ చేరబోయే జట్లు ఇవేనంటూ జోస్యం చెబుతూ ఉన్నారు.
భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఈ ప్రపంచ కప్ లో ఏయే జట్లు సెమీఫైనల్ చేరుతాయో అంచనా వేశాడు. తనకు తెలిసి నాలుగు సెమీ-ఫైనలిస్టులకు సంబంధించి కీలక ప్రకటన చేశాడు యువరాజ్ సింగ్. సెమీ-ఫైనల్ చేరుకునే జట్లలో దక్షిణాఫ్రికా ఉంటుందని అనుకుంటున్నానన్నాడు యువీ. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , ఇంగ్లాండ్ జట్లు కూడా సెమీస్ చేరే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు యువరాజ్. "ఇండియా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయని అనుకుంటున్నానన్నారు యువరాజ్ సింగ్. ప్రపంచ కప్లో ఎప్పుడూ ఏదో ఒక అప్సెట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను ఐదు జట్లను ఎంచుకుంటాను. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా కు కూడా అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాను. ఆ జట్టుకు వైట్ బాల్ ట్రోఫీ అవసరం " అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
Next Story