Mon Dec 23 2024 06:20:21 GMT+0000 (Coordinated Universal Time)
పబ్ బయట గొడవ.. ఆసుపత్రిలో క్రిటికల్ స్థితిలో క్రికెటర్
ఇటీవలి కాలంలో క్రికెట్ ప్రపంచం ఎంతో మంది క్రికెటర్లను కోల్పోయింది. ఇప్పుడు ఎంతో భవిష్యత్తు ఉన్న క్రికెటర్ ఖుమాలో
పబ్ బయట జరిగిన గొడవ కారణంగా క్రికెటర్ ఆసుపత్రి పాలయ్యాడు. 20 సంవత్సరాల మాండ్లి ఖుమాలో తాజాగా ఆసుపత్రి పాలయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ U-19 క్రికెటర్, ఆదివారం బ్రిడ్జ్‌వాటర్‌లోని ఫ్రియాన్ స్ట్రీట్‌లోని పబ్ బయట దాడి జరగడంతో ఆసుపత్రి పాలయ్యాడని BBC నివేదించింది. ఈ ఘటనకు సంబంధించి 27 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసి, విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అతడు నార్త్ పీథర్టన్ క్రికెట్ క్లబ్(North Petherton Cricket Club) కు ఖుమాలో ఆడుతూ ఉన్నాడు. ప్రొఫెషనల్ క్రికెటర్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని నివేదికలు తెలిపాయి. ఇటీవల అతడి జట్టు విజయం సాధించడంతో వారు సెలెబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఖుమాలో ఇప్పటి వరకూ నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు. నార్త్ పీథర్టన్ క్రికెట్ క్లబ్ ఒక ప్రకటనలో ఈ విషయంపై "బ్రిడ్జ్‌వాటర్‌లో జరిగిన సంఘటనతో నార్త్ పీథర్టన్ క్రికెట్ క్లబ్‌లోని అందరూ షాక్‌కు గురయ్యారు, ఈ ఉదయం బ్రిస్టల్‌లోని సౌత్మీడ్ హాస్పిటల్లో మా విదేశీ ఆటగాడు మాండ్లీ ఖుమాలో ఆసుపత్రి పాలయ్యారు." అని స్పందించింది. అతడు వేగంగా కోలుకోవాలని.. అతడికి తాము ఎప్పుడూ మద్దతును అందిస్తామని తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఉన్న అతని కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులను ధైర్యంగా ఉండాలని చెబుతున్నామని క్లబ్ ప్రకటనలో తెలిపింది. "మొండ్లీకి సహాయం చేసిన వారికి, ముఖ్యంగా సంఘటనా స్థలంలో, ఆసుపత్రిలో ఉన్న ఆరోగ్య సేవా సిబ్బందికి మా ధన్యవాదాలు." అని చెప్పుకొచ్చారు. అతడి హెల్త్ అప్డేట్ కు సంబంధించిన సమాచారం ఇంకా అందాల్సి ఉంది. అతడు వీలైనంత త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అరెస్ట్ చేయబడిన 27 ఏళ్ల వ్యక్తి ఎవరా..? ఏ కారణంతో దాడి చేశాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో క్రికెట్ ప్రపంచం ఎంతో మంది క్రికెటర్లను కోల్పోయింది. ఇప్పుడు ఎంతో భవిష్యత్తు ఉన్న క్రికెటర్ ఖుమాలో ఆసుపత్రి పాలవ్వడం.. క్రికెట్ కుటుంబాన్ని కలవరపెడుతూ ఉంది.
News Summary - South African Cricketer Mondli Khumalo Hospitalised After Assault Outside UK Pub
Next Story