Sun Dec 22 2024 21:24:06 GMT+0000 (Coordinated Universal Time)
ధోనికి షాక్.. సుప్రీం నోటీసులు
టీం ఇండియా మాజీ క్రికెటర్ ధోని కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అమ్రాపాలి కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
టీం ఇండియా మాజీ క్రికెటర్ ధోని కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అమ్రాపాలి కేసులో ధోనికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అమ్రాపాలి సంస్థకు థోని గతంలో బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. తనకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసినందుకు అమ్రాపాలి సంస్థ 40కోట్ల పారితోషికం ఇవ్వాలని థోని ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఆ సంస్థ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో థోని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తమకే ఇవ్వాలని....
అయితే సుప్రీంకోర్టుకు అమ్రాపాలి సంస్థ తమకు థోనీయే 42 కోట్ల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు థోనికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ధోనీకి నోటీసులు సుప్రీంకోర్టు జారీ చేయడంతో ఆయన సుప్రీంకోర్టుకు వాస్తవ విషయాలను వివరించాల్సి ఉంటుంది.
Next Story