Sat Apr 12 2025 00:31:07 GMT+0000 (Coordinated Universal Time)
రుతురాజ్ వీరబాదుడు.. ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు
విజయ్ హజారే ట్రోఫీలో క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్ లో 43 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు

విజయ్ హజారే ట్రోఫీలో క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్ లో 43 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఒక ఓవర్ లో ఏడు సిక్స్ లుకొట్టి రుతురాజ్ గైక్వాడ్ గత రికార్డులను బద్దలు కొట్టడు. ప్రపంచ రికార్డులను అధిగమించాడు. విజయ్ హజారే ట్రోఫి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.
ఒక ఓవర్ లో 43 పరుగులు...
మొత్తం బంతుల్లో 220 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ పది ఫోర్లు, 16 సిక్సర్లతో వీర బాదుడు బాదాడు. ఒకే ఓవర్ లో 43 పరుగులు సాధించిన ఘనతను కూడా సాధించాడు. ఇందులో నో బాల్ కూడా ఉండటం రుతురాజ్ కు కలసి వచ్చింది. టీం ఇండియా యువ ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ పలు మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. అయితే అహ్మదాబాద్ లో ఉత్తర్ప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ ఈ రికార్డును సాధించాడు. గైక్వాడ్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Next Story