Sun Dec 22 2024 22:57:20 GMT+0000 (Coordinated Universal Time)
శార్ధూల్ ఠాకూర్ పెళ్లి
క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి
ఇండియన్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని కర్జత్ లో శనివారం నుంచి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. టీం ఇండియా క్రికెట్ శార్దూల్ ఠాకూర్ మిథాలీ పారుల్కర్ తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెద్దల సమక్షంలో ఇద్దరూ ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు. అందుకు ఈ నెల 27వ తేదీన ముహూర్తంగా నిర్ణయించారు. క్రికెట్ లో బిజీగా మారుతున్న సమయంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
వివాహ వేడుకలు...
ఇప్పటికే శార్దూల్ ఠాకూర్ వివాహ వేడుకలు ఆయన ఇంట ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకల్లో శార్దూల్ ఠాకూర్ నృత్యం చేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరి వివాహానికి సంబంధించి రెండేళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది. నవంబరు 2021లో ఎంగేజ్ మెంట్ అయినా కొన్ని కారణాలతో వివాహం వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఇద్దరూ ఒక్కటవుతుండటంతో శార్దూల్ ఠాకూర్ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మార్చి 17 నుంచి భారత్ - ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ ఆడాల్సి ఉంది. అలాగే మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ లోనూ శార్దూల్ ఠాకూర్ ఈసారి కోల్కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడనున్నారు.
Next Story