Fri Nov 22 2024 18:50:30 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెటర్ కాదు కంత్రీ: రిషబ్ పంత్ ను కూడా కోట్లలో మోసం
2014 నుంచి 2018 వరకు తాను ముంబై ఇండియన్స్ తరఫున ఆడానని.. తానెంతో పాపులర్ క్రికెటర్‌నని
ఆ యువకుడు తానొక క్రికెటర్ అంటూ చెప్పుకుని పెద్ద ఎత్తున మోసానికి తెగబడ్డాడు. 25 ఏళ్ల హర్యానాకు యువకుడు.. గతంలో U-19 క్రికెటర్ గా కొన్ని మ్యాచ్ లు ఆడాడు. అయితే ఈజీ మనీకి అలవాటు పడిన అతడు పలు లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లను మోసం చేయడమే కాకుండా.. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను కూడా కోట్లలో మోసం చేశాడు. మినాంక్ సింగ్ అనే వ్యక్తి విలాసవంతమైన జీవనం గడపడం కోసం మోసాలకు తెగబడ్డాడు. ఖరీదైన రెస్టారెంట్లలో తినడం.. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండాలని అనుకున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఈ యువ క్రికెటర్ మహిళలను మోసం చేయడానికి ముంబై ఇండియన్స్ జట్టులో తానూ భాగమని చెప్పుకొచ్చాడు.
2014 నుంచి 2018 వరకు తాను ముంబై ఇండియన్స్ తరఫున ఆడానని.. తానెంతో పాపులర్ క్రికెటర్‌నని ఎదుటి వ్యక్తులను నమ్మించేవాడు. క్రికెటర్ అని చెప్పుకొని ఈజీగా అమ్మాయిలకు దగ్గరయ్యేవాడు. బిల్లులు కట్టకుండా ఖరీదైన రెస్టారెంట్లలో తింటూ.. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండేవాడు. 2022లో మృనాంక్ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో బస చేశాడు. తర్వాత రూ.5.5 లక్షల బిల్లు కట్టకుండా వెళ్లిపోయాడు. సార్ బిల్లు కట్టండని సిబ్బంది అడిగితే.. అడిడాస్ వాళ్లు బిల్లు కడతారని చెప్పి, వాళ్ల దగ్గర్నుంచి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని వెళ్లిపోయాడు. బకాయిలు చెల్లించాలని హోటల్లో పలుమార్లు అతనిని సంప్రదించడానికి ప్రయత్నించాడు, అయితే అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పోలీసులు తనను వెంబడిస్తున్నారని తెలియడంతో ఫోన్ ఆఫ్‌లో ఉంచాడు. తాను దుబాయ్‌లో స్థిరపడ్డానని పరిచయస్తులను నమ్మించాడు. దీంతో అతనిపై లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. ఒక సంవత్సరం తర్వాత డిసెంబర్ 25 న హాంకాంగ్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఢిల్లీ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నటనలో అతడికి అతడే సాటి:
కర్ణాటకకు చెందిన IPS అధికారిగా కూడా మోసాలకు తెగబడ్డాడు. ఈసారి ఇమ్మిగ్రేషన్ అధికారులను మోసం చేసేందుకు డు మరో ప్రయత్నం చేశాడు. కర్ణాటక పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ అలోక్ కుమార్ లాగా పోజులిచ్చాడు. అరెస్టు నుండి తప్పించుకోవడానికి సీనియర్ పోలీసు అధికారులను కాల్ చేశాడు. ఢిల్లీ విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించిన తన కుమారుడు మృణాంక్ సింగ్‌కు సహాయం చేయాలని కూడా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. అతను పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినప్పటికీ ఈసారి పోలీసులు మోసపోలేదు. తనను అరెస్ట్ చేసిన పోలీసులను మరోవిధంగా మిస్ లీడ్ చేయాలని ప్రయత్నించాడు. మా నాన్న అలోక్ కుమార్ సింగ్ 1980ల్లో భారత జట్టు తరఫున ఆడాడని.. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మేనేజర్‌గా పని చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు.
మోసపోయిన వారిలో రిషబ్ పంత్
అనేక సందర్భాల్లో, అతను క్రికెటర్‌గా లేదా కర్ణాటకకు చెందిన సీనియర్ పోలీసు అధికారిగా పోజులిచ్చాడు. భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సహా పలువురిని మోసం చేశాడు. అతను పెట్టుబడులకు సంబంధించి 2020-2021లో రిషబ్ పంత్‌ను ₹ 1.63 కోట్ల మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాను ఖరీదైన ఉత్పత్తులను విక్రయిస్తూంటానని నమ్మించి పంత్ నుంచి 1.63 కోట్ల రూపాయలు వసూలు చేసి మాయమయ్యాడు. దీనిపై పంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని బాధితుల్లో క్యాబ్ డ్రైవర్లు, యువతులు, బార్లు- రెస్టారెంట్ యాజమాన్యాలు మొదలైనవి ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 40,000 మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. తన "లగ్జరీ లైఫ్‌స్టైల్" కు సంబంధించిన అనేక చిత్రాలను పంచుకున్నాడు.
పోలీసులు అతడి ఫోన్ ను చెక్ చేయగా.. అమ్మాయిలతో అతడు అసభ్యకరంగా దిగిన ఫొటోలను గుర్తించారు. అతడు డ్రగ్స్ కూడా కొనుగోలు చేశాడని గుర్తించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేసిన మృణాంక్ సింగ్ రాజస్థాన్‌లోని ఓపీజేఎస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. పోలీసులు మృణాంక్ తల్లిదండ్రులను సంప్రదిస్తే, తమ కొడుకుతో తాము తెగదెంపులు చేసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్ 25న మృణాంక్ ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. క్రికెటర్ నుండి కంత్రీ వ్యక్తిగా మారిపోయాడు మృణాంక్.
Next Story