Thu Apr 03 2025 10:17:05 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2025 : విశాఖలో తేలిపోయిన సన్ రైజర్స్.. ఢిల్లీదే పై చేయి
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

విశాఖపట్నంలో జరగుతున్న ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అయింది. 18.3 ఓవర్లకే ఆల్ అవుట్ అయి కేవలం 163 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోతున్న ఆటగాళ్లు ఇక్కడ మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఎవరూ పెద్దగా క్లిక్ కాలేదు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్ వర్మ వంటి వాళ్లతో ఉన్న ఈ జట్టు అతి తక్కువ పరుగులకే ఆల్ అవుట్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే ఒకే ఒకడు మాత్రం ఈ మ్యాచ్ లో మెరుపులు మెరిపించడం విశేషం.
చెలరేగిన కొత్త కుర్రోడు...
ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన అనికేత్ వర్మఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్స్ ను ఒక ఆటాడేసుకున్నాడు. మూడో మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. కేవలం 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సన్ రైజర్స్ జట్టును అనికేత వర్మ ఆదుకున్నట్లయింది. అనికేత్ వర్మ కేవలం నలభై ఒక్క బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 74 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ను వెన్ను విరిచాడు. విశాఖపట్నంలో ఈ పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. తక్కువ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ జట్టు శుభారంభంతోనే ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
డుప్లిసెస్ హాఫ్ సెంచరీ...
ఢిల్లీ కాపిటల్స్ జట్టులో డుప్లిసెస్ హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ చేసి అవుటయిన తర్వాత వరసగా రెండు వికెట్లను ఢిల్లీ కోల్పోయింది. తర్వాత వరసగా 38 పరుగులకు అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ పదిహేను పరుగులకు వెనుదిరిగాడు. క్రీజులో అభిషేక్ పోరెల్, స్టబ్స్ నిలకడగా రాణించారు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ లక్ష్యానికి చేరువలో స్కోరును తీసుకెళ్లగలిగారు. స్టబ్స్, అభిషేక్ పోరెల్ లు తమ జట్టు విజయానికి ముఖ్య కారణమయ్యారని చెప్పాలి. దీంతో ఢిల్లీ కాపిటల్స్ కు ఈ ఐపీఎల్ సీజన్ లో ఇది రెండో విజయంగా చెప్పాలి. మొత్తం మీద సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Next Story