Mon Dec 23 2024 19:49:37 GMT+0000 (Coordinated Universal Time)
టెన్షన్ పెట్టారు కాని.. అయ్యర్, యాదవ్ ల పుణ్యమే
కొంత టెన్షన్ పెట్టినా చివరకు భారత్ తొలి టీ 20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది.
టీం ఇండియా ఎప్పుడూ టెన్షన్ పెట్టకుండా ఆడలేదు. వెస్టిండీస్ తో జరిగిన టీ 20 మ్యాచ్ లోనూ చివరి దాకా టెన్షన్ పెట్టారు. సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ నిలదొక్కుకోకుంటే మ్యాచ్ చేజారిపోయేదే. కీలక ఆటగాళ్లు చేతులెత్తేయడంతో యువ ఆటగాళ్లపై వత్తిడి పెరిగింది. కొహ్లి, రిషబ్ పంత్ మరోసారి ఘోర వైఫ్యలం చెందారు. దీంతో కొంత టెన్షన్ పెట్టినా చివరకు భారత్ తొలి టీ 20 మ్యాచ్ లో ఘన విజయం సాధించింది.
భారీ లక్ష్యమే....
భారత్ వెస్టిండీస్ తో మొత్తం మూడు టీ 20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై పై చేయి భారత్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లకు 157 పరుగులు చేసింది. ఏడు వికెట్లను చేజార్చుకుంది. వెస్టిండీస్ లో పూరన్ 61 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ లు పెద్దగా ఆడకపోవడంతో కొంత భారత్ ఊపిరి పీల్చుకుంది. అయితే భారత్ ముందు భారీ లక్ష్యమే ఉంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత్ దిగింది.
కొహ్లి, పంత్ మరోసారి.....
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ 19 బంతుల్లోనే 40 పరుగులు చేసి కొంత అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచారు. ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషన్ కూడా 35 పరుగులు చేసి ఔటయ్యాడు. కొహ్లి, రిషబ్ పంత్ తక్కువ పరుగులకు అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడినట్లయింది. రన్ రేటు కూడా 8 వరకూ ఉండటంతో భారత్ అభిమానుల్లో టెన్షన్ మొదలయింది. అయితే సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ నిలదొక్కుకోవడం, ఇద్దరూ భారీ షాట్లతో అలరించి భారత్ కు విజయాన్ని అందించారు. చివరగా వెంకటేశ్ అయ్యర్ సిక్స్ కొట్టి భారత్ కు విజయాన్ని తెచ్చిపెట్టారు.
- Tags
- india
- west indies
Next Story