Mon Dec 23 2024 01:57:35 GMT+0000 (Coordinated Universal Time)
ధోని ఆడితే మామూలుగా ఉండదు.. క్రికెట్ అయినా.. మొబైల్ గేమ్ అయినా
ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఈ వీడియోలో ధోని తన దగ్గర ఉన్న ఐప్యాడ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇక ఆ గేమ్ ఊహించని డౌన్ లోడ్స్ ను
మహేంద్ర సింగ్ ధోని.. గ్రౌండ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ధోని బ్రాండ్ మీద నడుస్తున్న ఎన్నో ప్రొడక్స్ట్స్ ను చూశాం. ధోని పట్టుకున్నదంతా బంగారమే అని ఊరికే అనలేదు. తాజాగా మరోసారి రుజువు అయింది. రాంచీ నుంచి విమాన ప్రయాణంలో ఉన్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎయిర్ హోస్టెస్ ఓ గిఫ్ట్ ను ఇచ్చింది. ఆమె ధోనికి చాక్లెట్లను ప్రత్యేకంగా అందించింది. ఎయిర్ హోస్టెస్ నితికా చూపించిన అభిమానానికి ధోని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియో ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. కొన్ని నిమిషాల్లోనే అది కాస్తా వైరల్ గా మారిపోయింది.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఈ వీడియోలో ధోని తన దగ్గర ఉన్న ఐప్యాడ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇక ఆ గేమ్ ఊహించని డౌన్ లోడ్స్ ను ఇప్పుడు అందుకుంటూ ఉంది. ధోని ఆడిన క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్స్ భారీగా పెరిగాయట. ఈ వీడియో వైరల్ గా మారడంతో క్యాండీ క్రష్ యాప్ మూడు గంటల్లోనే 3.6 మిలియన్ల డౌన్ లోడ్స్ అయ్యాయట. క్యాండీ క్రష్ పెద్ద ఎత్తున డౌన్ లోడ్ అవుతోందని, ఇందుకు ధోనీకి థ్యాంక్స్ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
Next Story