Fri Jan 10 2025 11:09:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫేక్ బీన్ ను పంపి పాకిస్థాన్ జింబాబ్వేను మోసం చేసిందా..?
పాకిస్థాన్ పై జింబాబ్వే టీ20 ప్రపంచ కప్ లో ఊహించని విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ కు ముందే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. పాకిస్థాన్ 'ఫేక్ మిస్టర్ బీన్' ను పంపి మమ్మల్ని మోసం చేసిందని జింబాబ్వే నెటిజన్లు చెప్పుకొచ్చారు. ఇందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. వర్షం పడకుండా దేవుడిని వేడుకోండి అంటూ పోస్టులు పెట్టారు జింబాబ్వే అభిమానులు. ఇంతకూ ఏమి జరిగిందని నెటిజన్లు చెబుతున్నారంటే..
తమ దేశానికి ఫేక్ బీన్‌ను పంపి మోసారని.. ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తప్పందటూ చసురా అనే జింబాబ్వే అభిమాని హెచ్చరించాడు. వర్షం కురవాలని కోరుకోండని సూచించాడు. 2016లో తమ దేశానికి మిస్టర్ బీన్ బదులు పాకిస్థాన్ ఫేక్ బీన్‌ను పంపించిందని.. అతడికి తమ పోలీసులు రక్షణ ఇవ్వడంతోపాటు.. అగ్రికల్చర్ షోలో పాల్గొన్నాడని చసురా చెప్పాడు. మిస్టర్ పాక్ బీన్ అని చెప్పుకునే అతడు పలు ఫంక్షన్స్ లో పాల్గొని తమ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడని జింబాబ్వే అభిమాని వెల్లడించాడు. పాకిస్థాన్ ఇలా కూడా మోసం చేసిందా అంటూ పలువురు ఈ పోస్టును షేర్ చేశారు. ఇక మ్యాచ్ ముగిసింది.. జింబాబ్వే పాక్ కు షాకివ్వడంతో ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారిపోయింది.
పాక్‌పై జింబాబ్వే విజయం సాధించిన అనంతరం నెటిజన్లు చసురా ట్వీట్లకు స్పందిస్తూ ఉన్నారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం అతడి ట్వీట్‌కు స్పందించాడు. ఫ్రాడ్ బీన్‌ను ఇచ్చినందుకు పాక్‌పై గొప్పగా ప్రతీకారం తీర్చుకున్నారంటూ వీరూ ప్రశంసించాడు. ఏది ఏమైనా ఈ పాక్ మిస్టర్ బీన్ వ్యవహారం క్రికెట్ అభిమానులకు తెగ నచ్చేసింది.
టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వే పాకిస్థాన్ కు కోలుకోలేని షాకిచ్చింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ లో జరిగిన ఈ మ్యాచ్ లో జింబాబ్వే సంచలనాన్ని నమోదు చేసింది. ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే విజయాన్ని అందుకుంది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి పాక్ కు 3 పరుగులు కావాల్సి ఉండగా.. కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడం.. షాహిన్ షా అఫ్రీది రనౌట్ గా వెనుదిరగడంతో జింబాబ్వే విజయాన్ని అందుకుంది.
Next Story