Mon Dec 23 2024 01:20:49 GMT+0000 (Coordinated Universal Time)
క్రికెట్ అభిమానులకు మరో సూపర్ న్యూస్
క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. Disney+ Hotstar తన మొబైల్ యాప్‌లో
క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. Disney+ Hotstar మొబైల్ యాప్‌లో ICC 2024 పురుషుల T20 ప్రపంచ కప్ గేమ్‌లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మ్యాచ్ లను ఎటువంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా మొబైల్ ఫోన్స్ లో చూసుకోవచ్చు. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్ జూన్ 1 నుండి జూన్ 29 వరకు జరగనుంది. వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్లో టోర్నీ మొదలుకానుంది. Disney+ Hotstar తమ YouTube ఛానెల్ ప్రపంచ కప్ కోసం ప్రోమోను షేర్ చేసింది. టోర్నమెంట్‌లోని అన్ని గేమ్‌లు మొబైల్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని ధృవీకరించింది.
ఇంతకు ముందు, Disney+ Hotstar తన మొబైల్ యాప్‌లో 2023 ఆసియా కప్, 2023 ODI ప్రపంచ కప్‌లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేసింది. 2024 T20 ప్రపంచ కప్ గేమ్‌లను ఇతర వాటిలో చూడడానికి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ జూన్ 2న డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో యునైటెడ్ స్టేట్స్, కెనడా మధ్య పోటీతో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో భారతదేశం మొదటి గేమ్ జూన్ 5న న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇక ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్‌లో జరగనుంది.
Next Story