Mon Dec 23 2024 07:50:33 GMT+0000 (Coordinated Universal Time)
WC 2023 మరో సంచలన రికార్డ్: ప్రపంచ కప్ లో 500 పరుగులు ఇచ్చిన బౌలర్ ఎవరో తెలుసా?
చెత్త ప్రపంచ రికార్డు సృష్టించిన పాక్ బౌలర్
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లండ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రవూఫ్ శనివారం ప్రపంచ కప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా రికార్డును బద్దలు కొట్టాడు. అంటే ఇదేదో గొప్ప రికార్డు కాదనుకోండి.. చెత్త రికార్డే..!
2019లో ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ చేసిన 526 పరుగుల రికార్డును రవూఫ్ అధిగమించాడు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక ఈ రికార్డును నెలకొల్పడానికి చాలా దగ్గరగా వచ్చాడు, 2023 ప్రపంచ కప్ లో తొమ్మిది ఇన్నింగ్స్లలో 525 పరుగులు సమర్పించుకున్నాడు మధుశంక. కేవలం ఒక పరుగు వెనుక నిలిచిపోయాడు. హరీస్ రవూఫ్ మాత్రం సరికొత్త రికార్డును అందుకున్నాడు. హరీస్ రవూఫ్ ఈ ప్రపంచ కప్ లో ఏకంగా 533 పరుగులు ఇచ్చి చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు.
ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు
533 - హరీస్ రౌఫ్ (పాకిస్తాన్, 2023)
526 - ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్, 2019)
525 - దిల్షాన్ మధుశంక (శ్రీలంక, 2023)
502 - మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా, 2019)
484 - ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్, 2019)
481 - షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్, 2023)
ఇంగ్లండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హరీస్ రవూఫ్ 10 ఓవర్ల పాటూ బౌలింగ్ వేసి 64 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో పాక్ తరపున బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు రవూఫ్. ఈ ప్రపంచ కప్ లో 9 మ్యాచ్ లు ఆడిన రవూఫ్ 16 వికెట్లు తీశాడు.
Next Story