Mon Dec 23 2024 12:46:48 GMT+0000 (Coordinated Universal Time)
వన్డే క్రికెట్ లో ప్రపంచ రికార్డు బాదిన ఇంగ్లండ్.. 498 పరుగుల భారీ స్కోర్
వన్డే క్రికెట్ లో ప్రపంచ రికార్డు ఇంగ్లండ్ 498 పరుగుల భారీ స్కోర్
వన్డే క్రికెట్ లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డును సాధించింది. నెదర్లాండ్స్ మీద 50 ఓవర్లలో 498 పరుగుల స్కోరును సాధించింది ఇంగ్లండ్. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న నెదర్లాండ్స్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. జేసన్ రాయ్ కేవలం ఒక్క పరుగే చేసి అవుట్ అయినా.. ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్, డేవిడ్ మలాన్, బట్లర్ లు సెంచరీలతో అదరగొట్టారు. ఆఖర్లో లివింగ్స్టన్ పిచ్చ కొట్టుడు కొట్టాడు.
జేసన్ రాయ్ వెనుదిరిగినా.. ఫిలిప్ సాల్ట్ కు డేవిడ్ మలాన్ తోడయ్యాడు. మలాన్ 109 బంతుల్లో 125 పరుగులు చేయగా.. సాల్ట్ 93 బంతుల్లో 122 పరుగులు చేశాడు.ఇక ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన బట్లర్.. అదే ఊపులో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 70 బంతుల్లో 162 పరుగులు చేశాడు. ఇందులో 14 సిక్సర్లు ఉన్నాయి. ఇక మోర్గాన్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగగా.. ఆఖర్లో లివింగ్స్టన్ ఊచకోత కోశాడు. 22 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అందులో 6 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. నిర్ణీత 50 ఓవర్లలో 498 పరుగులు చేసి 500 పరుగులకు 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది ఇంగ్లండ్. ఈ ఇన్నింగ్స్ తో వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సాధించింది.
News Summary - England makes highest score in the history of ODI cricket
Next Story