Fri Jan 10 2025 15:13:57 GMT+0000 (Coordinated Universal Time)
టీ20 ప్రపంచ కప్: ఆఫ్ఘన్ పై గెలిచిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ పై ఇంగ్లండ్ విజయం సాధించింది. స్వల్ప లక్ష్యమైనా చేధించేందుకు ఇంగ్లండ్ బాగా కష్టపడింది. 113 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 5 వికెట్లను కోల్పోయింది. లియామ్ లివింగ్ స్టన్ 29 నాటౌట్ పర్వాలేదనిపించగా.. హేల్స్ 19, బట్లర్ 18, డేవిడ్ మలాన్ 18, బెన్ స్టోక్స్ 2, హ్యారీ బ్రూక్ 7 పరుగులతో విఫలమయ్యారు. ఫరూఖీ, ముజీబ్, రషీద్ ఖాన్, అహ్మద్ మాలిక్, మొహమ్మద్ నబీ చెరో వికెట్ తీశారు. మొయిన్ అలీ 8 నాటౌట్ తో నిలవడంతో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ను శామ్ కర్రాన్ కుప్పకూల్చాడు. ఆఫ్ఘన్ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (32), ఉస్మాన్ ఘనీ (30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. హజ్రతుల్లా జజాయ్ (7), రహ్మనుల్లా గుర్బాజ్ (10), నజిబుల్లా జద్రాన్ (13), మహమ్మద్ నబీ (3), అజ్మతుల్లా ఒమర్జాయ్ (8), రషీద్ ఖాన్ (0), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (0), ఫజల్లాక్ ఫరూకీ (0), ఫరీద్ అహ్మద్ (2 నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రాన్ ఐదు వికెట్లతో రాణించగా.. బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
Next Story