Mon Dec 23 2024 11:07:45 GMT+0000 (Coordinated Universal Time)
టీ20 ప్రపంచ కప్: ఐర్లాండ్ తో తలపడనున్న ఇంగ్లండ్
ఈ ఏడాది T20 ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఉన్నాయి. పలు మ్యాచ్ లలో ఊహించని మలుపులు.. అద్భుతమైన ఇన్నింగ్స్ లను క్రికెట్ అభిమానులు చూసారు. నెదర్లాండ్ సూపర్ 12 లకు అర్హత సాధించడం.. MCGలో పాకిస్తాన్‌పై భారతదేశం ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను న్యూజిలాండ్ చిత్తు చేసింది.
ఈరోజు ఇంగ్లండ్ తో ఐర్లాండ్ తలపడనుంది. ఐర్లాండ్ మరోసారి ఇంగ్లండ్ కు షాకిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. గత మ్యాచ్ లో ఇంగ్లండ్ బౌలర్లు ముఖ్యంగా శామ్ కుర్రాన్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ యూనిట్‌ను కుప్పకూల్చారు. ఈ మ్యాచ్ లో కూడా అతను ఫామ్‌ను కొనసాగించాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. ఉదయం 9:30కు మ్యాచ్ మొదలుకానుంది.
స్క్వాడ్స్:
ఇంగ్లండ్: జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, ఫిలిప్ సాల్ట్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, టిమాల్ మిల్స్
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(సి), లోర్కాన్ టక్కర్(w), హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, స్టీఫెన్ డోహెనీ, కోనర్ ఓల్ఫెర్ట్, గ్రాహం హ్యూమ్ ఫియోన్ హ్యాండ్
Next Story